వరుసగా ఐదో రోజూ తగ్గిన పెట్రోలు ధర... తాజా ధరల వివరాలు!

  • 9 పైసలు తగ్గిన పెట్రోలు ధర
  • మారని డీజెల్ ధర
  • వెల్లడించిన ఐఓసీ
కర్ణాటక ఎన్నికలు ముగిసిన తరువాత వరుసగా 16 రోజుల పాటు పెరుగుతూ వచ్చి ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరిన 'పెట్రో' ఉత్పత్తుల ధరలు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతుండటంతో నెమ్మదిగా దిగొస్తున్నాయి. నేడు వరుసగా ఐదో రోజూ పెట్రోలు ధర తగ్గింది. పెట్రోలు ధరను 9 పైసలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.  ఇదే సమయంలో డీజెల్ ధరను సవరించడం లేదని తెలిపింది.

తాజా ధరల వివరాలు పరిశీలిస్తే, పెట్రోలు ధర లీటరుకు ఢిల్లీలో రూ. 78.11, కోల్ కతాలో రూ. 80.75, ముంబైలో రూ. 85.92, చెన్నైలో రూ. 81.09గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 82.74గా ఉంది. ఇదే సమయంలో డీజెల్ ధర ఢిల్లీలో రూ. 6911, కోల్ కతాలో రూ. 71.66, ముంబైలో రూ. 73.58, చెన్నైలో రూ. 72.97గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 75.12గా ఉంది.
Go Back to Shorts
Petrol
Diesel
Rates
IOCL
Hyderabad

More Telugu News